Aug 20,2023 23:43

ప్రజాశక్తి - రేపల్లె: చైల్డ్‌ రైట్స్‌ అడ్వకసీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలలో ఆదివారం సోలార్‌ స్ట్రీట్‌ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్‌ మేనేజర్‌ ఎస్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలంలోని బొబ్బర్లంక, రావి అనంతవరం, పెనుమూడి, చోడాయపాలెం, పిరాట్లంక, పోటుమెరక, కారుమూరు, విశ్వేశ్వరం గ్రామాలలో ఆయా గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో సోలార్‌ స్ట్రీట్‌ లైట్లు అమర్చామని అన్నారు. తమ ఫౌండేషన్‌ సేవలను మరింత విస్తతం చేస్తామన్నారు.