ప్రజాశక్తి- అనంతగిరి:మారుమూల గిరిజన గ్రామాల్లో సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పరిష్కారానికి కృషి చేస్తానని జడ్పిటిసి దీసరి. గంగరాజు అన్నారు. శనివారం మండలంలోని పెద్దబిడ్డ పంచాయతీ పరిధి మారుమూల గుమ్మడుపాడు, మూలగవురు, పట్టెగరువు, .గుర్రందాటు గ్రామాలలో కొండకోనలు, గెడ్డవాగు దాటుతూ వెళ్లి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు, తాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన దృష్టికి గిరిజనులు తీసుకువచ్చారు. అనంతరం గిరిజనులతో ఆయన మాట్లాడుతూ, కంటిపురం మెయిన్ రోడ్డు నుండి గుమ్మళ్ళపాడు మీదుగా పట్టెగారువు, మూలగరువు గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కలెక్టర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాగునీటి సమస్యపై జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం టోకురు సర్పంచ్ కిల్లో. మొస్య, సిపిఎం మండల కార్యదర్శి ఎస్.నాగులు, నాయకులు జే.సుబ్బారావు, జె.సింహద్రి, తదితరులు పాల్గొన్నారు...










