మాట్లాడుతున్న అధికారి
గ్రామాలలో రైతులకు శిక్షణ .
ప్రజాశక్తి-బిట్రగుంట:బోగోలు మండలం, ఉమామహేశ్వరపురం, అల్లిమడుగు, ఎస్.వి. పాలెం గ్రామలలో ఆత్మవారి సౌజన్యంతో మండల వ్యవసాయ అధికారిని విజయలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు అర్.బి.కే స్థాయిలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వనరుల కేంద్రం, వ్యవసాయ అధికారి ఈ. శైలజ కుమారి పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో 120 రోజుల కాల పరిమితి కలిగిన ఎన్ ఎల్ ఆర్-34449,3354 ,40024, 3238, కె ,ఎన్, ఎం 1638, 733, పి,ఎన్‌ఆర్,15048 రకాలను సాగుచేసుకోవాలని తెలిపారు. విత్తనం కొన్న వెంటనే మొలక శాతం నిర్ధారించుకోవాలని, విత్తనం విత్తే సమయంలో విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు. కషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు, పంటల ఉత్పత్తి విభాగ శాస్తవ్రేత్త డాక్టర్ కె. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వరి పంటలో ఎరువులు, కలుపు యాజమాన్య పద్దతులను వివరించారు. రైతులు ద్రవరూప జీవన ఎరువులు తప్పనిసరిగా వాడుకోవాలని తెలియజేశారు. ద్రవరూప జీవన ఎరువులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్ధానం, తిరుపతిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా వనరుల కేంద్రం, వ్యవసాయ అధికారి జి. మధురిమ నీటి యాజమాన్యం బురద పదునులో నాట్లు వేసుకొని తరువాత నీరు వారం రోజుల వరకు 5 సెం.మీ పెట్టుకోవాలని. తదుపరి దుబ్బు చేయటం పూర్తయ్యేవరకు పొలంలో పలుచగా అంటే 2-3 సెం.మీ., చిరుపొట్ట దశ నుండి గింజ గట్టి పడే వరకు సుమారు 5 సెం.మీ. నీటి మట్టం ఉండాలని. కోతకు 7-10 రోజుల ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గించి ఆరపెట్టాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి ఎస్. విజయ లక్ష్మి మాట్లాడుతూ కాండం తొలిచే పురుగు యాజమాన్యానికి ప్రధాన పొలంలో గుళికల మందులు వాడితే ఖర్చు ఎక్కువవుతుంది గనుక, నారు నాటే వారం రోజుల ముందు ఎకరాకు సరిపడే నారుమడికి 800 గ్రా. ల కార్బోప్యూరాన్ 3జి గుళికలు లేదా 600 గ్రా.ల ఫిప్రోనిల్ 0.3జి గుళికలు వేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ రైతులు, వి.ఏ.ఏలు తదితరులు పాల్గొన్నారు.