ప్రజాశక్తి-యంత్రాంగం
ప్రజాశక్తి -ఆనందపురం : గ్రామీణ ప్రాంతాలలో ఉచిత వైద్య సేవలందించడానికి కుటుంబ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ షేక్ షహనాజ్ సాధ్య తెలిపారు. రామవరం గ్రామంలో కుటుంబ డాక్టర్ విధాన ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ వెళ్లి దీర్ఘకాలంగా బాధపడుతున్న రోగులను పరామర్శించి వైద్య సేవలందించారు. స్థానిక సర్పంచ్ ఎర్ర పైడిరాజు మాట్లాడుతూ, గ్రామాల్లోని ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోపరుచుకోవాలని కోరారు. బాలింతలు, మధుమేహం, రక్తపోటు తదితరాలకు సుమారు 63 మందికి వైద్య పరీక్షలు జరిపారు. అంగన్‌వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో 104 వైద్యాధికారి డాక్టర్ జి.ఆదిత్య మాట్లాడుతూ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు నెలకు సరిపడే మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సామాజిక ఆరోగ్యాధికారి పి.సాంబమూర్తి మాట్లాడుతూ, ఇంటి పరిసరాలలో నీటి నిలువలు లేకుండా చూసుకుంటే దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయన్నారు. దీని ద్వారా డెంగీ, మలేరియా, చికున్‌గునియా, టైఫాయిడ్ తదితర వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కె.పుష్పారావు, డిపిఎం ఒ ప్రసాదరావు, ఆరోగ్య పర్యవేక్షకులు పి.సన్యాసిరావు, సిహెచ్‌ఒ పూర్ణిమ, ఆరోగ్య కార్యకర్తలు ఎస్.నర్సింహమూర్తి, ఎస్.బంగారమ్మ. డిఇఒ కె.జ్ఞానేశ్వరరావు, ఆశా కార్యకర్తలు ఎర్ర ఈశ్వరమ్మ, లక్ష్మి, పైలెట్ బి.తాతబాబు పాల్గొన్నారు.
భీమునిపట్నం : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన వైఎస్‌ఆర్ క్లినిక్‌ల ద్వారా అందిస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్‌తో ఇంటి ముంగిటకే వైద్యం అందుతున్నట్లు ఎంపిపి దంతులూరి వెంకట శివ సూర్య నారాయణరాజు తెలిపారు. మండలంలోని మూలకుద్దులో వైఎస్‌ఆర్ క్లినిక్‌ను, అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. వైద్యులు కీర్తి సందీప్, శివ రామ కృష్ణారావుతో ఎంపిపి మాట్లాడారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొల్లి పార్వతి, ఉప సర్పంచ్ కొయ్య రామకృష్ణారెడ్డి, వైసిపి యూత్ లీడర్ కోటిరెడ్డి, దాకమర్రి ఎంపిటిసి సభ్యులు చెల్లూరి నగేష్‌బాబు, ఎఎన్‌ఎం, ఆశాలు పాల్గొన్నారు.










