Dec 20,2022 00:03

మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి-పాయకరావుపేట:ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సోమవారం స్థానిక విశ్రాంతి భవనం వద్ద రాజుగారి బీడీ సిమెంట్‌ రోడ్డు ఇరువైపులా స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు మొక్కలు నాటారు. ముందుగా విగేశ్వర స్వామి ఆలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పేరుతో పూజలు నిర్వహించారు. సిమెంట్‌ కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మండల అభివృద్ధి చైర్మన్‌ చిక్కాల రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు దనిశెట్టి బాబురావు, పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గూటూరు శ్రీనివాసరావు, ఇసారపు తాతారావు, దగ్గుపల్లి సాయి బాబా, జగతా శ్రీను, సర్పంచులు నాయకులు, కార్యకర్తలు మండలాధికారులు తదితరులు పాల్గొన్నారు
గొలుగొండ:మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని జెడ్పీటీసీ సుర్ల వెంకట గిరిబాబు సూచించారు. సోమవారం సోషల్‌ ఫారెస్ట్‌ ఎఫ్‌ఎస్‌ఓ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో మండలంలోని ఎన్‌.కంఠారం పంచాయతీ ఆర్‌అండ్‌బి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ విడుదల రాజేశ్వరి, ఎంపిటిసి లక్ష్మీ దుర్గ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.