ప్రజాశక్తి - కలిదిండి
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తుందని కైకలూరు ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు(డిఎన్‌ఆర్) అన్నారు. మండలంలోని పడమటిపాలెంలో రూ.13.40 లక్షలు, గ్రామ పంచాయతీ నిధులు రూ.7.70 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, జగనన్న కాలనీలో వీధిదీపాల విద్యుత్ లైనును ఆయన ప్రారంభించారు. సర్పంచి సానా మీనా సరస్వతి, క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నంబూరి శ్రీదేవి, వైసిపి మండల అధ్యక్షులు తిరుమాని రమేష్, ఎంపిటిసి టెక్కెం శ్యామ్, ఎఎంసి ఉపాధ్యక్షులు పాము రవికుమార్, ఎఎంసి మాజీ ఛైర్మన్ నీలపాల వెంకటేశ్వరరావు, చిట్టూరి బుజ్జి, సానా రాము, పడవల శ్రీను, ఆర్‌డబ్ల్యూఎస్ ఎఇ నాగబాబు, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.










