
మహిళతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
ప్రజాశక్తి-వడ్డాది : గడప గడప నిధులతో గ్రామాలలో మౌలిక సదుపాయాలు పెంపొందిస్తున్నామని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. బుధవారం ఉదయం వడ్డాది-1 సచివాలయంలో ఎమ్మెల్యే ఇంటింటి పర్యటన చేశారు. సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. తన దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశించారు. జగనన్న సురక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి దొండా రాంబాబు, వైస్ ఎంపీపీ దొండా లలితా నారాయణమూర్తి, సర్పంచు కోరుకొండ కామలక్ష్మి, ఉప సర్పంచ్ దాడి సూర్య నాగేశ్వరరావు, వైసీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు.