Jul 19,2023 00:19

సర్టిఫికెట్లు అందిస్తున్న యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు

ప్రజాశక్తి - పరవాడ : మండలంలోని వాడచీపురుపల్లి పంచాయతీ గ్రామ సచివాలయం-1, 2ల వద్ద మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధులుగా పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్‌ రాజ్‌, ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు, జడ్పీటీసీ పైల సన్యాసిరాజు పాల్గొని లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ బంధం నాగేశ్వరరావు, బూస అప్పలరాజు, వైసిపి నాయకులు కోటాన రాము, కోన రామారావు, వెన్నెల సన్యాసిరావు, తహసీల్దార్‌ కనకరావు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : జగనన్న సురక్ష కార్యక్రమం ఆవ సోమవారం, మడుతూరు గ్రామాలలో సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 11 రకాల సర్టిఫికెట్లను మంజూరు చేసి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్‌ యు సుకుమార వర్మ, జడ్పిటిసి లాలం రాంబాబు, నర్మాల కుమార్‌, దేశం శెట్టి శంకర్రావు, ఎంపీడీవో విజయలక్ష్మి డిఈ వీరభద్రరావు పాల్గొన్నారు.