ప్రజాశక్తి- వేపాడ : మండలంలోని వీలుపర్తి సచివాలయం పరిధిలోని దుంగాడ, చిన్నదుంగాడ, చామలాదేవి అగ్రహారంలో శనివారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి డి సత్యవంతుడు, ఎఎంసి చైర్‌పర్సన్ ఎం. కస్తూరి, వైసిపి నాయకులు గోకాడ సత్యనారాయణ, బీల సతీష్, వంటాకు శ్రీను, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు నిరుద్యోగి వెంకటరావు, సర్పంచ్ ఎం గంగరాజు, మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ సన్యాసినాయుడు, ఎంపిడిఒ బిఎస్కేఎన్ పట్నాయక్, పంచాయతీ కార్యదర్శి పద్మ, అంగనవాడి కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
ఎంపిపికి సత్కారం
ఎంపిపిగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దొగ్గ సత్యవంతుడును ఎమ్మెల్యే స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో శనివారం ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రతి ఒక పంచాయతీకి ఇంటికి రెండు చొప్పున డస్ట్ బిన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి అడపా ఈశ్వరరావు, జెఎసిస్ కన్వీనర్ శ్రీను, ఎంపిటిసి ఆకుల సత్తిబాబు, యువత అధ్యక్షులు శ్రీను, ప్రత్యేకాధికారి లక్ష్మి నారాయణ, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.










