Jul 19,2023 00:14

మహిళలకు కరపత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

ప్రజాశక్తి-కొయ్యూరు
మండలం బకులూరు గ్రామ సచివాలయం బాలారం పంచాయతీ పరిధిలోని మల్లవరం, పాత బలరాం, కొత్త బలరాం గ్రామాలలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి చేపట్టారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా 380 గడపలను సందర్శించారు. నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకారాన్ని గణాంకాలతో సహా భాగ్యలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ అప్పన వెంకటరమణ, వైసిపి నాయకులు జల్లి బాబులు, నాగమణి, అచ్యుత్‌, బండి సుధాకర్‌, రేగటి ముసలి నాయుడు, ధోని బాబ్జి, గాడి సత్యనారాయణ, వనం బాబు, శేఖర్‌, రామరాజు, కూడా రాజు, అప్పన్న, గజ్జయదొర, స్థానిక నాయకులు బుజ్జి, వెంకన్న తాత, గోవింద్‌, నాగియమ్మ, గోపి, రవికుమార్‌, నూకరత్నం పాల్గొన్నారు.