
ప్రజాశక్తి-దేవరాపల్లి
మండలంలోని వేచలం పంచాయతీ పరిధిలోని పలు కల్లాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మంగళవారం నిర్వహించారు. కల్లాల వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్లి రైతులను పలకరిస్తూ పథకాలు వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కల్లాల్లో వారికి కావాల్సిన మంచిని నీరు, విద్యుత్, రోడ్డు సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జగన్నాధపురం కాలువపై స్లబ్ కల్వర్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కల్లాలలో నీటి అవసరాల నిమిత్తం 20 వేల లీటర్ల నీటి సామర్ధ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కర్రి సత్యం, వైసీపీ మండల అధ్యక్షులు బూరె బాబురావు, ఎంపీడీవో సుబ్బలక్ష్మి, సర్పంచ్ నాగిరెడ్డి శఠరి నాయుడు, అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
పరవాడ : మండలంలోని వెన్నలపాలెం పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి అందిస్తున్న సంక్షేమ పధకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైల సన్యాసిరాజు, వైసిపి రాష్ట్ర సీఈసీ సభ్యులు పైల శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు, పెందుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అన్నంరెడ్డి అజరు రాజ్, మండల అధ్యక్షులు కోన రామరావు, స్థానిక సర్పంచ్ వెన్నెల అప్పారావు, ఎంపీటీసీ వెన్నెల అరుణ కుమారి, వైసిపి నాయకులు వెన్నెల సన్యాసిరావు, పైల అప్పలనాయుడు, పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, అధికారులు పాల్గొన్నారు.