Dec 26,2022 23:47

సమస్యలు తెలుసుకుంటున్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

ప్రజాశక్తి-అనకాపల్లి
పట్టణంలోని జివిఎంసి 82వ వార్డు పరిధి విజయరామరాజుపేట శ్రీరామనగర్‌ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సోమవారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల కరప్రతాలను ప్రజలకు ఇచ్చి వారి సమస్యలను, పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రూ.10 లక్షలతో బాల గణపతి ఆలయం రోడ్డు, రూ.23.50 లక్షలతో ఇన్‌కమ్‌ టాక్స్‌ వీధి రోడ్డు, రూ.25.85 లక్షలతో డ్రైనేజీలు, రూ.18 లక్షలతో గాంధీనగర్‌ పార్క్‌ ఆధునికీకరణ, రూ.5 లక్షలతో సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ డాక్టర్‌ బివి.సత్యవతి, కార్పొరేటర్‌ మందపాటి సునీత, జోనల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మి, వైసిపి నాయకులు జానకి రామరాజు, డాక్టర్‌ రామ్మూర్తి, మళ్ల బుల్లిబాబు, పలక రవి, జాజుల రమేష్‌ పాల్గొన్నారు.
సబ్బవరం : మండలంలోని సబ్బవరం పంచాయతీ శివారు గొర్లివానిపాలెం బుడగ జంగాల కాలనీలో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌ రాజు నిర్వహించారు. గంగిరెడ్ల కాలనీ, బుడగ జంగాల కాలనీల్లో తాగునీటి కుళాయిలు కావాలని గ్రామస్తులు కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌ మాట్లాడుతూ సచివాలయాలకు కేటాయించిన నిధులతో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ తుంపాల అప్పారావు, ఎంపీడీవో రమేష్‌ నాయుడు, వైసిపి నాయకులు అజరు రాజ్‌, బోకం రామునాయుడు, గొర్లి అచ్చంనాయుడు, కోటాన రాము, సబ్బవరపు నారాయణ మూర్తి, వనం అచ్చం నాయుడు, కర్రి బాబు, యడ్ల నాయుడు పాల్గొన్నారు.
మునగపాక రూరల్‌ : మండలంలోని పాటిపల్లి సచివాలయ పరిధి నారాయుడుపాలెం, చిన్నోడుపాలెం గ్రామాలలో సోమవారం స్థానిక శాసనసభ్యులు యువి రమణ మూర్తి రాజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పెంట కోట స్వామి సత్యనారాయణ, ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, స్థానిక సర్పంచ్‌ కారుకొండ వెంకటలక్ష్మి, ఎంపీటీసీ ఇల్లా శిరీష, ఎండిఓ రవికుమార్‌, వైసిపి నాయకులు ఆడారి గణపతి అచ్చం నాయుడు, ఆడారి త్రిమూర్తులు, దొడ్డి కోటేశ్వరరావు, సూరిశెట్టి రామకృష్ణ పాల్గొన్నారు.