ప్రజాశక్తి-కశింకోట : మండల కేంద్రం కశింకోటలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రెండో రోజు శుక్రవారం కూడా నిర్వహించారు. వీధి కాలువలు, విద్యుత్ సౌకర్యంలో ఉన్న లోపాలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పిసినికాడ ఎస్సీ కాలనీ శ్మశాన వాటిక ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేన్సర్‌తో కొద్ది రోజుల క్రితం మరణించి లెంక ప్రవీణ్ కుమార్ వైద్యానికి భారీ మొత్తంలో ఖర్చు అయిందని, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్ధిక సహాయం అందించాలని మంత్రిని బాధితులు కోరారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కలగా లక్ష్మి, గున్నయ్య నాయుడు, జడ్పీటీసీ దంతులూరి శ్రీధర్ రాజు, వైస్ ఎంపీపీ పెంటకోట జ్యోతి శ్రీనివాస్, సర్పంచ్ మంత్రి జయరజని, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, వైసిపి నాయకులు మళ్ల బుల్లిబాబు, పలకా రవి, మలసాల కిషోర్, ఉప సర్పంచ్ నడిపల్లి లక్ష్మినాయుడు, ఎంపీటీసీలు యల్లపు నూకరత్నం, చేవెట్టి చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
వడ్డాది : మండలంలోని విజయరామరాజుపేటలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ శుక్రవారం 2వ రోజు కొనసాగించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అమలపై అరా తీశారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు కషి చేస్తానని ఆయన తెలిపారు. ఆర్‌ఎస్ ఛానల్ పూడికతీత చేపట్టాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దొండా రాంబాబు, వైస్ ఎంపిపి దొండా లలితా నారాయణ మూర్తి, సర్పంచ్ విజయకుమార్, ఎంపీటీసీ బాలకృష్ణ, వైసిపి మండల అధ్యక్షుడు కె.అచ్చం నాయుడు, తహశీల్దారు అంబేద్కర్, ఎంపీడీవో సువర్ణ రాజు పాల్గొన్నారు.










