Dec 20,2022 23:59

వృద్ధులతో మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు

ప్రజాశక్తి- కె.కోటపాడు
మండలంలోని దాలివలస గ్రామంలో మంగళవారం ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రెండో రోజు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి రూ.3.50 కోట్లు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రాథమికోన్నత పాఠశాలకు నాడు నేడు కింద రూ.24 లక్షల మంజూరు చేసామన్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి జగన్మోహన్‌, జెడ్పిటిసి ఈర్లే అనురాధ తదితరులు పాల్గొన్నారు.
మునగపాక రూరల్‌ : మండలంలోని నాగవరం సచివాలయ పరిధి కుంచవానిపాలెం, అప్పికొండ వానిపాలెం, మల్లవరం గ్రామాలలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శాసనసభ్యులు యువి.రమణ మూర్తి రాజు, ఎలమంచిలి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు రొంగలి జగన్నాధరావు నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలు తీరును ఆయా గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా కుంచవానిపాలెం రామాలయం వద్ద మొక్కలు నాటారు. 120 మంది నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్‌ యు.సుకుమార్‌ వర్మ, జడ్పిటిసి పెంటకోట స్వామి సత్యనారాయణ, ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, వైసిపి నాయకులు ఆడారి గణపతి అచ్చం నాయుడు, సీర రమణమ్మ, స్థానిక ఎంపీటీసీ మరిసా రమణ, పాలి పిన్ని శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్‌ ఇందల హేమలత పాల్గొన్నారు.