Apr 20,2023 20:10

నేలకోసిగిలో భూమి పూజ చేస్తున్న మురళీమోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి - కోసిగి రూరల్‌
మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి గ్రామాలాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వైసిపి మండల ఇన్‌ఛార్జీ మురళీమోహన్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు గురువారం మండలంలోని నేలకోసిగిలో సర్పంచి పశువుల హనుమంతమ్మ అధ్యక్షతన రూ.10 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ముఖ్యఅతిథిగా మురళీ మోహన్‌రెడ్డి హాజరయి మాట్లాడారు. 'గడపగడపకు మన ప్రభుత్వం'లో భాగంగా ప్రతి గ్రామంలో ప్రజల అభ్యర్థన మేరకు చేపట్టాల్సిన పనులకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఇంకా అవసరమైతే ఎమ్మెల్యే సొంత నిధులతో పనులను చేపడతారని చెప్పారు. పిఆర్‌ ఎఇ యుగంధర్‌ రెడ్డి, ఎంపిపి ఈరన్న, మహాంతేష్‌ స్వామి, నాడిగేని నాగరాజు, జగదీష్‌ స్వామి, జంపాపురం బసిరెడ్డి, కాల్వ లక్ష్మయ్య, నేలకోసిగి లక్ష్మన్న, వీరేష్‌, గానుగ వీరస్వామి పాల్గొన్నారు.