Apr 25,2023 21:48

ప్రజాశక్తి - కైకలూరు
     గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో వైసిపి ఘోరంగా విఫలమైందని టిడిపి నాయకులు ఆరోపించారు. మంగళవారం కెనాల్‌ రోడ్డు, పెద్ద మసీదు ఎదురు వీధిలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షులు పి.త్రినాథరాజు మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీల ద్వారా రహదారులు, వీధిలైట్లు వేయడం గానీ, ఇతర అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. కైకలూరులో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు మొహ్మద్‌ జానీ, వాణిజ్య విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు బొమ్మనబోయిన విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి లక్ష్మీరాణి, ఎఎంసి మాజీ ఛైర్మన్‌ తాడినాడ బాబు, మండల ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ పాల్గొన్నారు.