Nov 08,2023 21:27

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిపి గవదకట్ల వెంకట లక్ష్మమ్మ

గ్రామాల అభివృద్ధికి సహరించాలి
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించాలని ఎంపిపి గవదకట్ల వెంకట లక్ష్మమ్మ కోరారు. బుధవారం వరికుంటపాడు స్త్రీ శక్తి భవనంలో ఎంపిపి గవదకట్ల వెంకట లక్ష్మమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సహకరించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరి పలు సూచనలు సూచించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని మండలంలో జరుగుతున్న జగనన్న హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణ పనుల బిల్లును లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్‌ అధికారులకు సూచించారు.
ముఖ్యంగా గ్రామాల్లో తాగునీరు, విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. ముందుగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల పురోగతిపై మాట్లాడారు. అనంతరం దుత్తలూరు ఎస్‌ఐ ఎన్‌.ప్రభాకర్‌ తన సిబ్బంది బందోబస్తు నడుమ సజావుగా మండల సర్వసభ్య సమావేశం ముగింపు చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ శ్రీదేవి, తహశీల్దార్‌ మల్లిఖార్జున, వైస్‌ ఎంపిపి మధు, సొసైటీ అధ్యక్షులు రామాంజనేయులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.