Nov 17,2023 19:50

సమస్యలు తెలుసుకుంటున్న గుడిసె ఆది కృష్ణమ్మ

ప్రజాశక్తి - ఆదోని
వైసిపి హయాంలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె ఆది కృష్ణమ్మ విమర్శించారు. శుక్రవారం మండలంలోని సంతేకుడ్లూరు గ్రామంలో 'బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ' నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజల వద్దకు వెళ్లి టిడిపి సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 2024లో టిడిపి, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాశక్తి తదితర పథకాలతో మహిళలకు మేలు జరుగుతుందని తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చలేదని విమర్శించారు. ఎక్కడ చూసినా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, తాగునీటి సమస్య వేధిస్తోందని తెలిపారు. డ్రెయినేజీలు కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. అర్హత ఉన్నా చాలామందికి పింఛను రావడం లేదని విమర్శించారు. నాయకులు మురళీ, తెలుగు యువత ఉపాధ్యక్షులు గుడిసె రామకృష్ణ, సాధిక్‌ వలీ, సంతేకుడ్లూరు రాఘవరెడ్డి, బాబురావు, లక్ష్మీకాంత రెడ్డి, చిరంజీవి, సురేష్‌, బాలరాజు, శాంత రాజు, వీరేష్‌, మహాలింగ, సిద్ధ ఉన్నారు.