Nov 04,2023 20:51

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : 'రాచమల్లు'

ప్రజాశక్తి - ప్రొద్దుటూరు( పుట్టపర్తి సర్కిల్‌) : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. శనివారం గోపవరం పంచాయతీ, భగత్‌ సింగ్‌ కాలనీ 6వ వీధి బీట్‌ రోడ్డు రూ.11 లక్షలతో నిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో జరిగిన గడప గడపకూ కార్యక్రమంలో ఒక మహిళ రోడ్డు వేయాలని కోరడంతో 60 మీటర్ల సిమెంట్‌ రోడ్డు, గ్రావెల్‌ రోడ్డు కలిపి రూ.11లక్షల వ్యయంతో పనులు చేపడుతున్నామన్నారు. రూ.4 కోట్ల వ్యయంతో హౌసింగ్‌ బోర్డ్‌లో పార్క్‌ నిర్మాణం త్వరలో నిర్మించనున్నట్లు తెలి పారు. టిడిపి నాయకులు బాబుతోనే భవిస్త్యత్‌ అని ఇంటింటికీ తిరిగి బాబుకు ఓటు వేయండని, భవిష్యత్తు గారంటీ అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. 2014లో బాబు ఇచ్చిన మానిఫెస్టోకే గారంటీ లేదని, బాబు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే టిడిపి నాయ కులు తలలు ఎక్కడ పెట్టుకుంటారని, స్థానిక నాయకుల భవిష్యత్‌కు గారంటీ గల్లంతు అవుతుందన్నారు. 2014లో హామీలు ఏమేర నెరవేర్చారో టిడిపి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. వైసిపి 2019 మానిఫెస్టోలో 99శాతం తీర్చిందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ వరికూటి ఓబుళరెడ్డి, మాజీ సర్పంచ్‌ దేవిప్రసాద్‌రెడ్డి, సర్పంచ్‌ మోషే, ఉపసర్పంచ్‌, ఎంపీటిసిలు ఓబయ్య యాదవ్‌, వసుంధర, మార్కెట్‌ యార్డ్‌ డైరెక్టర్‌ గోకుల మేరీ, నాయ కులు కొండయ్య, గంజికుంట శివారెడ్డి పాల్గొన్నారు. భూమిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే రాచమల్లు, ప్రజాప్రతినిధులు