
ప్రజాశక్తి- పాయకరావుపేట: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా వైఎస్‌ఆర్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. పట్నంలోని ప్రధాన మెయిన్ రోడ్డు కోటి 90 లక్షల రూపాయలతో గౌతమి థియేటర్ నుంచి వై జంక్షన్ వరకు రోడ్డు ఎట్టకేలకు శనివారం ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే బాబురావు, విఎమ్‌ఆర్డిఏ చైర్ పర్సన్ విజయనిర్మల శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైసిపి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో రోడ్డు మంజూరు చేసినప్పటికీ వేయలేదన్నారు. టిడిపి నేతలే పాయకరావుపేట ప్రధాన మెయిన్ రోడ్డు పనులను ఇప్పటివరకు అడ్డుకున్నారని తెలిపారు. ఎప్పటికైనా పాయకరావుపేట ప్రజలు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పబ్లిక్ ప్రచార వింగ్ చైర్మన్ దగ్గుపల్లి సాయిబాబా, జడ్పిటిసి లంక సూర్యనారాయణ, వైయస్సార్ మండల పార్టీ అధ్యక్షుడు దనిశెట్టి బాబురావు, ఎంపీపీ పార్వతీ తాతారావు, పాయకరావుపేట సర్పంచ్ గారా ఉషశ్రీ ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గుంటూరు శ్రీనివాసరావు, తహశీల్దార్ జయప్రకాష్, ఎంపీడీవో సాంబశివరావు, అధికారులు, నాయకులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.