నిమ్మనపల్లి : గ్రామాలలో అభివద్ధిని చేపట్టడానికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. బుధవారం స్థానిక వైసిపి నాయకులు విజరుకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో వెంగళవారీ కురవపల్లి, వెంగళవారిపల్లి, నాగంవారిపల్లి, పెద్దరాజులపల్లి, బోడిబండ, గంగాపు రంపల్లి లో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎంపిపి నరసింహులు, సింగల్ విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్‌రెడ్డి, మండల వైసిపి ఇన్‌ఛార్జి ఆర్‌ఐ.రమణారెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ రామమోహన్‌రెడ్డి, స్థానిక వైసిపి నాయకులతో కలిసి గ్రామంలోని ప్రతి లబ్ధిదారులను పలకరించారు. ప్రభుత్వం అంది స్తున్న సంక్షేమ ఫలాలను వివరించారు. జగనన్న పాలనలో నిరుపేదలకు సంక్షేమ పథకాలు అండగా నిలపడ్డాయని అన్నారు. వైసిపి నాలుగేళ్ల పాలనలో 98 శాతం హామీలను నెరవేర్చిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మాట ఇచ్చాడంటే అది తప్పక నెరవేరుస్తాడని తెలిపారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా, అర్హత ప్రామాణికంగా తీసుకుంటూ సంక్షేమ పథకాలను జగనన్న అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు దళారీ వ్యవస్థలను, అవినీతిని పెంచి పోషించారని, ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు అందాలంటే ముడుపులు చెల్లించుకునే పరిస్థితి ఆనాడు ఉండేదన్నారు. జగనన్న పాలనలో దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా సచివాలయ, వాలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేసి పేదలకు సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకే జమ చేయిస్తున్నారని తెలిపారు. పజలకు ఏ అవసరం ఉన్నా తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజలకు మంచి చేసే వైసిపి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి జయప్రకాశ్ రెడ్డి, సర్పంచులు సుబ్రమణ్యం, మహాదేవ రెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రఫీ, నాయకులు శేషాద్రి రెడ్డి, నవీన్, నరేంద్ర రెడ్డి, శశిధర్ రెడ్డి, సివి రమణారెడ్డి, హేమంత్, నాగరాజా, గోపాలకష్ణ, హౌటల్ రఫీ, శంకర, గంగాధర, రవి, మహేష్, తహశీల్దార్ మంజుల, ఎంపిడిఒ శేషగిరిరావు, డిటి సిరాజుద్దీన్, మండల సర్వేయర్ మురళి నాయక్, ఎఇలు వసంత రెడ్డి, హరినాథ్‌రెడ్డి, అమర్నాథ్, ఎపిఒ రమేష్, ఎస్‌ఐ రామకష్ణ, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.










