Mar 15,2023 00:07
బెంచీలను బహూకరించిన దృశ్యం

ప్రజాశక్తి-అద్దంకి: గ్రామాలలో యువత ప్రజానీకానికి సేవలతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేయాల్సి న అవసరం ఉందని మా ఊరు అభివృద్ధి కమిటీ బాధ్యులు బి శ్రీనివాసరావు పేర్కొన్నారు. దాతల సహకారంతో రూ.30 వేల విలువచేసే బల్లలను వేలమూరిపాడు మా ఊరు అభివృద్ధి కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా దాతలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ అద్దంకి నుంచి వేలమూరిపాడు రోడ్డు మార్గం వాకర్స్‌కు ఎంతగానో ఉపయోగ పడుతోందని, ఉదయం, సాయంత్రం సమయా ల్లో సుమారు 200 మందికి పైగా వాకర్స్‌ నడకని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మార్గ మధ్యంలో వాళ్లు సేదతీరటానికి బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని బెంచ్‌లను ఏర్పాటు చేసి అందుబాటు లోకి తీసుకొస్తామని తెలిపారు. మా ఊరు అభివృద్ధి కమిటీ రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆదర్శంగా నిలిచిందన్నారు. తనతోపాటు ముందుకొచ్చి సహకరించిన నవయుగ స్వీట్స్‌ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. దాతృత్వ హృద యాలను అభినందిస్తూ త్వరలోనే అభినందన సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మా గ్రామ స్తుల తరపు నుంచి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని వివరించారు.