బొమ్మనహాల్:కంకర క్వారీ గనుల ఏర్పాటు సమయంలో వాటి యజమానులు గ్రామాభివృద్ధి కోసం సహకరిస్తామని అనేక హామీలు ఇచ్చారని ఆయితే ఆచరణలో వాటిని అమలు చేయడం లేదని నేమకల్లు గ్రామస్తులు తెలియజేశారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామం వద్ద రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ గనుల ఏర్పాటు కోసం జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. నేమకల్లు గ్రామం వద్ద రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ గనులను ఏర్పాటు చేసేందుకోసం ప్రజాభిప్రాయ సేకరణను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలు వా అభిప్రాయాలను తెలియజేశారు. కంకర మిషన ద్వారా గ్రామానికి పెద్దగా ఉపయోగ లేదన్నారు. గ్రామ పరిధిలో అభివద్ధి కార్యక్రమాలు వారు ఏమీ చేయడం లేదన్నారు. గ్రామాభివృద్ధి కోసం కంకర మిషన్ యజమానులు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నేమకల్లు గ్రామం పరిధిలో ఉన్న గనులు, క్రషర్ యూనిట్ల వారు కమిటీ ఏర్పాటు చేసుకుని సిఎస్‌ఆర్ కార్యకలాపాలు ద్వారా నేమకల్లు గ్రామం అభివద్ధి కోసం ఖర్చు చెయ్యాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎపిపిసిబి ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పివి.కిషోర్ రెడ్డి, ఎపిపిసిబి ఎఈఈ కృష్ణారెడ్డి, తహసీల్దార్ మైసమ్మ, సర్పంచి పరమేశ్వరతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.