గ్రామాభివద్ధికి సమన్వయంతో పనిచేయాలి : ఎమ్మెల్యే
ప్రజాశక్తి- నాయుడుపేట: ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాభివద్ధి సాధించాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. శనివారం నాయుడుపేట ఎంపీడీవో కార్యా లయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మండల సమావేశాలకు ఎంపీటీసీలు, సర్పంచులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. అధికారులు ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరాలు తెలిపి వాటిని అమలు పరిచేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అభివద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అర్హతే ప్రామా ణికంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకా లు అందించడంలో అధికారుల కీలకపాత్ర పోషిం చాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు చురుకుగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించి నప్పుడే గ్రామాభి వద్ధి సాధ్యమవు తుందన్నారు. ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి మాట్లాడుతూ అధికారు లు అర్హత ఉన్న ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందించి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేందుకు కషి చేయాలని సూచిం చారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం సద్విని యోగం అయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జగనన్న భూ రీ సర్వే రైతులకు ఎంతగానో ఉపయోగ పడు తుందన్నారు. మండల వ్యవసాయ అధికారి గణేష్ మాట్లాడుతూ ఈ వ్యవసాయ సీజన్లో రైతులకు సబ్సిడీతో పచ్చ రొట్ట విత్తనాలను అంది స్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట జడ్‌పిటిసి కట్టా జ్యోతి రెడ్డి, తహశీల్దారు ఎం రాజేంద్ర, ఎంపీడీవో శివప్రసాద్, పలువురు అధికారులు, కార్యదర్శులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.










