May 29,2023 21:29

సన్మానం చేస్తున్న వైసిపి సీనియర్‌ నాయకులు లక్ష్మి కాంత రెడ్డి

ప్రజాశక్తి - నందవరం
మండలంలోని కనకవీడు గ్రామ సచివాలయంలో సేవా మిత్ర పురస్కారాన్ని సోమవారం వైసిపి మండల సీనియర్‌ నాయకులు కెఆర్‌.లక్ష్మీకాంత్‌ రెడ్డి, సర్పంచి మద్దీశ్వరిలు గుమ్మల పుష్ప రాణికి అందజేశారు. నిస్వార్థంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో వాలంటీరుగా అందించిన సహకారం మరువలేనిదని, వెల కట్టలేని మీ సేవకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గౌరవ పురస్కారం ఇదేనని, ప్రజలకు సేవ చేసి మరింత కృషి చేయాలని కోరారు. వైసిపి నాయకులు పేట శ్రీనివాస్‌ రెడ్డి, వైస్‌ ఎంపిపి నడిపి షేక్‌ సాహెబ్‌, వెంకటరాముడు, తిక్కన్న పాల్గొన్నారు.