గ్రామ వాలంటీర్ గుడిసె అర్ధరాత్రి దగ్ధం.
రూ. 2 లక్షల ఆస్తి నష్టం.
ప్రాణభయంతో పరుగులు తీసిన కుటుంబ సభ్యులు.
ప్రజాశక్తి - రుద్రవరం.
మండలంలోని పెద్దకంబలూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో గ్రామ వాలంటీర్ కిరణ్ గుడిసె దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో బయటపడ్డారు. గ్రామస్తులు వివరాల మేరకు గ్రామ వాలంటరీగా పని చేస్తున్న కిరణ్ 6 మంది కుటుంబ సభ్యులతో గుడిసెలో కాపురం ఉంటున్నారన్నారు. శుక్రవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుడిసె నాలుగు దిక్కుల మంటలు వ్యాపించడంతో అది గమనించిన కుటుంబ సభ్యులు ప్రాణ భయంతో ఇంటిలో నుంచి పరుగులు తీశారు అన్నారు. వారుకేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పి వేశారన్నారు.ఈ ప్రమాదంలో వంట సామాగ్రి దుస్తులు, దాన్యము ,రూ 20 వేలనగదు కాలి బూడిద అయ్యాయన్నారు. అగ్నిప్రమాదంలో రూ 2 లక్షల ఆస్తి నష్టము జరిగి ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. కట్టుబట్టలతో బయటపడిన బాధితులకు ప్రభుత్వము వెంటనే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.











