Apr 24,2023 20:17

మాట్లాడుతున్న మేజర్‌ పంచాయతీ సర్పంచి అయ్యమ్మ

ప్రజాశక్తి - కోసిగి రూరల్‌
గ్రామ స్వపరిపాలన కోసం 1994లో పంచాయతీ రాజ్‌ చట్టాన్ని తెచ్చారని కోసిగి మేజర్‌ పంచాయతీ సర్పంచి ఎస్‌.అయ్యమ్మ, ఇఒఆర్‌డి హరుణ్‌ రషీద్‌, వైసిపి మండల సీనియర్‌ నాయకులు ఎస్‌.మాణిక్యరాజ్‌ తెలిపారు. సోమవారం పంచాయతీ కార్యాలయంలో పంచాయతీరాజ్‌ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. వార్డు సభ్యులు కె.రాముడు, వైసిపి యువ నాయకులు ఎస్‌.రాజేష్‌ పాల్గొన్నారు. గోనెగండ్ల మండల ప్రజా పరిషత్‌ సమావేశ భవనంలో పంచాయతీరాజ్‌ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పంచాయతీలకు నిర్దేశించిన తొమ్మిది అంశాల నుంచి వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన పంచాయతీలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు తాటికొండ వెంకటేష్‌, తోటయ్య, సోమేశ్‌, రామదాసు, గోపాల్‌, వెంకట నరసమ్మ, గోనెగండ్ల పంచాయతీ సర్పంచి హైమావతి, ఎంపిడిఒ కార్యాలయ ఎఒ బాబు, భాస్కర్‌కు ప్రశంసా పత్రాలు అందజేసి పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. సతీష్‌, కిరణ్‌ పాల్గొన్నారు.