Dec 27,2022 00:04

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాబూరావు

ప్రజాశక్తి-కోటవురట్ల:గ్రామ కన్వీనర్లు, సారదుల నియామకంతో గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు కోరారు. సోమవారం ఆయన మండల పరిషత్‌ ఆవరణలో వార్డు, గ్రామ వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు గ్రామ కన్వీనర్లు, సారధులను ఆయన ప్రకటించారు. ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పని చేసి సంక్షేమ ఫలాలు అర్హులైన వారికి అందరికీ అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చింతలపూడి వెంకట రామయ్య, జడ్పిటిసి సభ్యురాలు ఉమాదేవి, దత్తుడు రాజు, వైసిపి ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.