Apr 27,2023 21:16

మహిళా పోలీసులతో మాట్లాడుతున్న డిఐజి, ఎస్పీ

ప్రజాశక్తి - గోనెగండ్ల
గ్రామాల్లోని సమస్యలు, నేరాలపై సచివాలయ మహిళా పోలీసుల అవగాహన కలిగి ఉండి క్రియాశీలకంగా వ్యవహరించాలని కర్నూలు రేంజ్‌ డిఐజి సెంథిల్‌ కుమార్‌, ఎస్పీ కృష్ణ కాంత్‌ తెలిపారు. గురువారం గోనెగండ్ల పోలీసు స్టేషన్‌ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్‌ఐ ఎం.తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘనంగా స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు. సచివాలయ మహిళా పోలీసులతో వారు మాటామంతి నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లోని సమస్యలు, నేరాలపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండి క్రియాశీలకంగా వ్యవహరించాలని వారికి సూచనలు చేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌ నిర్వహణను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఎమ్మిగనూరు రూరల్‌ సిఐ మోహన్‌ రెడ్డి, ఎఎస్‌ఐ తిమ్మారెడ్డి పాల్గొన్నారు.