ముదినేపల్లి : మండలంలోని కోరగుంటపాలెంలో రూ.43.50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనంను శనివారం ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు ప్రారంభించారు. ఆనంతరం గ్రామంలో రూ.16 లక్షల గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, పిఎసిఎస్ అధ్యక్షులు అచ్యుత రాంబాబు, గంటా సంధ్య, వైస్ ఎంపిపిలు సునీత, రాధా, తదితరులు పాల్గొన్నారు.










