Apr 08,2023 23:58

గ్రామ సచివాలయాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

ప్రజాశక్తి-చోడవరం
గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలు అందుబాటులోకి వచ్చాయని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. శనివారం మండలంలోని అడ్డూరు గ్రామ సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కావలసిన సేవలన్నీ సచివాలయం ద్వారా అందడంతో పాటు నేరుగా ఇంటికే వచ్చి వాలంటీర్లు సమాచారాన్ని చేరవేస్తూ సేవలు అందిస్తున్నారని తెలిపారు. అనంతరం జగనన్న నువ్వే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటి వద్ద స్టిక్కర్ర్‌ అతికించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతో పాటు వైసిపి నాయకులు సిమ్మి నాయుడు, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
టిడిపి నుంచి వైసిపిలో చేరిక
అడ్డూరు గ్రామంలో టిడిపి మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ బోయిన చిన్నం నాయుడు, చుక్క శ్రీను, మామిడి లోవ, ఎస్‌.దేవుడు బాబు, ఎలమంచిలి సోమేషు, చుక్క బాబూజీ, చుక్క వెంకట్రావు ఆధ్వర్యాన 20 కుటుంబాల వారు టిడిపి నుంచి వైసీపీలో సుమారుగా శనివారం చేరారు. వారికి స్థానిక శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.