ప్రజాశక్తి-చందర్లపాడు
చందర్లపాడు గ్రామంలో ఒక్కొక్క సచివాలయానికి రూ.40 లక్షల చొప్పున రూ.80 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన 2 గ్రామ సచివాలయ భవనాలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమన్నారు , ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్ల ముంగిటే అందించేందుకు గ్రామ వాలంటీర్ ,గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను రూపొందించారని తెలిపారు ,ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ ,జడ్పిటిసి ముక్కపాటి నరసింహారావు , ఎంపీపీ వేల్పుల ఏసమ్మ ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు ,మండల పార్టీ అధ్యక్షులు కందుల నాగేశ్వరరావు , నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్, లాల్ సా ,ఎంపీటీసీ సభ్యులు కోట సత్యనారాయణ పాల్గొన్నారు.










