Nov 27,2022 00:21

మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి

ప్రజాశక్తి-సబ్బవరం : మండలంలోని తవ్వవానిపాలెం, అమృతపురం, గొల్లలపాలెం గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌ పఠాన్‌ శెట్టి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ఆయా సచివాలయాల సిబ్బంది పనితీరును, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను పరిశీలించారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని సూచించారు. అమృతపురం, గొల్లలపాలెం గ్రామాల్లో సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా తవ్వవానిపాలెం సచివాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమేష్‌ నాయుడు, ఈఓపిఆర్డీ మహేష్‌ సర్పంచ్‌లు బోకం స్వామినాయుడు, బైలపూడి గౌరి, మోపాడ అప్పారావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.