Sep 05,2023 23:36

ప్రారంభిస్తున్న స్పీకర్‌ సీతారాం

* శాసనసభ స్పీకర్‌ సీతారాం
ప్రజాశక్తి- పొందూరు: 
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని కృష్ణాపురంలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయ నూతన భవనం, రూ.21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. అలాగే రూ.20 లక్షలు గడపగడపకు మన ప్రభుత్వం నిధులతో సిసి రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ పరిపాలనతో ప్రజానీకానికి చేదోడు వాదోడుగా నిలిచిందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి గ్రామానికీ మౌలిక సదుపాయాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేశామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విస్తృతమైన సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
ప్రజా సంక్షేమానికే గడప గడపకు మన ప్రభుత్వం
బూర్జ : ప్రజా సంక్షేమ విస్తరణలో సమతుల్యం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అని స్పీకర్‌ తమ్మినేని సీతారం అన్నారు. మంగళవారం బూర్జ మండలం అప్పల పట్నాయక్‌ పేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న తమ్మినేని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహనరెడ్డి ఎంతో దఢసంకల్పంతో రాష్ట్రాభివద్ధి కోసం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ప్రజాదరణ పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి నాగేశ్వరరావు, జడ్పిటిసి బేజ్జీ పురుపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర టిట్కో డైరెక్టర్‌ కండాపు గోవిందరావు, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ డైరెక్టర్‌ జల్లు బలరాం నాయుడు, మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షులు గుమ్మడి రాంబాబు, స్థానిక నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.