Jul 08,2023 21:17

గొట్టివలస గ్రామ సమీపంలో ఉన్న ఏనుగులు

ప్రజాశక్తి-గరుగుబిల్లి : కొమరాడ, జియమ్మవలస మండలాల నుంచి తరలివచ్చిన ఏనుగుల గుంపు మూడు రోజుల నుంచి గొట్టివలస పరిసర ప్రాంతాల్లో తిష్టవేసింది. గురువారం అర్ధరాత్రి గ్రామంలో హల్‌చల్‌ చేశాయి. పశువుల శాలలు, నాటుబళ్లు, తౌడు బస్తాలను ధ్వంసం చేశాయి. శుక్రవారం రాత్రి గొట్టాపు సూర్యనారాయణకు చెందిన ట్రాక్టర్‌ తొట్టిని ధ్వంసం చేశాయి. దీంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం పార్వతీపురం గరుగుబిల్లి ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారి పరిధిలోని మామిడి తోటల్లో ఏనుగులు సంచరిస్తుండడంతో బిక్కుబిక్కుమంటూ వాహన చోదకులు ప్రయాణం చేస్తున్నారు. పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు భయాందోళన చెందుతున్నారు.