Nov 08,2022 23:46

ఆరోగ్య తనిఖీలు నిర్వహిస్తున్న వైద్యులు

ప్రజాశక్తి -ఆనందపురం : గొట్టిపల్లి గ్రామంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యాన మంగళవారం ఫ్యామిలీ ఫిజిషియన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గొట్టిపల్లి సర్పంచ్‌ గంటా జగదీశ్వరరావు మాట్లాడుతూ, ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానంతో గ్రామీణ ప్రాంతాలకు వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. హాస్పిటల్‌కి వెళ్లలేని వృద్ధులు, చిన్న పిల్లలకు, దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 69 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ షేక్‌ షహనాజ్‌ సాధ్య తెలిపారు. బాలింతలు, మధుమేహం, రక్తపోటు ఉన్నవారికి పరీక్షలు, గర్భిణులకు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులు అందజేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఇళ్లకు వెళ్లి తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో 104 వైద్యాధికారి డాక్టర్‌ జి.ఆదిత్య, సామాజిక ఆరోగ్య అధికారి పి.సాంబమూర్తి, పంచాయతీ కార్యదర్శి పి.సురేష్‌బాబు, ప్రసాదరావు, ఆరోగ్య పర్యవేక్షకులు పి.సన్యాసిరావు, సిహెచ్‌ఒలు ప్రీతి పండ, స్వర్ణలత, ఆరోగ్య కార్యకర్తలు సింహాచలం, జ్ఞానేశ్వర్‌ రావు, ఆశా కార్యకర్తలు గంగాభవాని, సరస్వతి కృష్ణవేణి, బంగారమ్మ, సావిత్రి, పైలెట్‌ తాతబాబు తదితరులు పాల్గొన్నారు.