Sep 12,2023 00:14

అద్దంకి - ప్రజాశక్తి
టిడిపి అధినేత చంద్రబాబును అప్రజాస్వామ్యంగా అక్రమ కేసులు బనాయించి  అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలింపుకు నిరసనగా టిడిపి ఇచ్చిన రాష్ట్ర బంద్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నామ్ రోడ్‌పై బైఠాయించి రాస్తా రోకో చేశారు. ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్‌, టిడిపి నాయకులను సీఐ బి రమేష్ బాబు, ఎస్ఐ అనిల్ కుమార్ అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 41నోటీసు జారీ చేసి  విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 40ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం, 14ఏళ్లు ఉమ్మడి రాష్ట్రానికి, 5ఏళ్లు నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసి 9ఏళ్లు  ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా ఉన్న చంద్రబాబును సైకో సిఎం జగన్ కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి సిఐడి అధికారులు శుక్రవారం అక్రమ కేసులు బనాయించారని అన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబును నంద్యాలలో ఆయన బస చేసిన బస్సు తలపులు తట్టి అర్ధరాత్రి 11గంటల నుండి వేకువ జామున 6.00గంటలకు అరెస్ట్ చేసి రహదారి వెంట దాదాపు 10గంటలు సిఐడి కార్యాలయానికి తరలించి కేసులు నమోదు చేశారని అన్నారు. ఏసిబి కోర్టులో హాజరు పరిచి 14రోజులు రిమాండ్‌పై జైలుకి తరలించడం దుర్మార్గమైన చర్యని అన్నారు. టిడిపిని నిర్వీర్యం చేసేందుకు వైసిపి కుట్రలు పన్నిందని అన్నారు. ఎన్ని కుట్రలు, కేసులు పన్నినా టిడిపిని ఏమీ చేయలేరని అన్నారు. నిరసన కార్యక్రమంలో నాగినేని రామకృష్ణ, కరి పరమేష్, కె నాగేశ్వరరావు, చిన్ని లక్ష్మి శ్రీనివాసరావు, కుక్కపల్లి ఏడుకొండలు, కుందారపు రామారావు, దామా సురేంద్ర, జయకృష్ణ, డి నాగేశ్వరరావు, రావూరి రమేష్, డి రాజేష్ పాల్గొన్నారు.