Nov 16,2022 17:42

ప్రజాశక్తి - మండవల్లి
              భారతీయ చిత్రకళ చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన ఏకైక వ్యక్తి రాజారవివర్మేనని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ఎల్‌ఎస్‌.భాస్కరరావు అన్నారు. గ్రంథాలయ వారోత్సవాలు, చిత్రకారుడు రవివర్మ 175వ జయంతిని పురస్కరించుకుని స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం చిత్రలేఖన పోటీలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుళ్లు దేవతల చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించింది రాజా రవివర్మేనని చెప్పారు. అంతేకాకుండా రామాయణ మహాభారతంలోని గొప్ప గొప్ప ఘట్టాలను చిత్రాలుగా మలచి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యా తలను ఆయన గణించారని తెలిపారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిత్రలేఖన పోటీల్లో గెలుపొందినవారికి గ్రంథా లయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో బహుమతులు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్‌ పర్వీన, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు కె.సత్యవర్దిని, ఎం.రమ, ఎస్‌కె తోహిరునిస పాల్గొన్నారు.