Sep 20,2023 22:49

'గోవింద కోటి' పుస్తకాల పంపిణీ

'గోవింద కోటి' పుస్తకాల పంపిణీ
వినాయకసాగర్‌లో ప్రత్యేక పూజలు జిల్లావ్యాప్తంగా వినాయక నిమజ్జనం తిరుపతిలో 8 లక్షలకు అమ్ముడుపోయిన లడ్డుప్రజాశక్తి - తిరుపతి టౌన్‌ , యంత్రాంగం
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తొలి సమావేశంలోనే ప్రవేశ పెట్టిన గోవింద కోటి లిఖిత కార్యక్రమం ఆచరణలోకి తేవడానికి బుధవారం తొలి అడుగుపడింది. వినాయక సాగర్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడి సాక్షిగా శాసన సభ్యులు, టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి భక్తులకు గోవింద కోటి పుస్తకాలు పంపిణీ చేశారు. విఘ్నాలను హరించే వినాయకుడే గోవింద కోటి రాస్తున్నట్లుగా తయారు చేసిన విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంది. నగర మేయర్‌ డాక్టర్‌ శిరీష, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ హరిత, గోవింద కోటి వినాయక విగ్రహ కాన్సెప్టర్‌ కిషన్‌ పాల్గొన్నారు.
భక్తి ఉద్యమంలా వినాయక చవితి
వినాయక చవితిని భక్తి ఉద్యమంగా మార్చిన వినాయక నిమజ్జన కమిటీకి టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అభినందనలు తెలిపారు. తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరియాలని, రాబోయే రోజుల్లో మరింత గొప్పగా వినాయక చవితి వేడుకలు, నిమజ్జనం నిర్వహిస్తామన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో వినాయక విగ్రహం నెలకొల్పి ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించిన మేయర్‌ డాక్టర్‌ శిరీషను, కమిషనర్‌ హరితకు అభినందనలు తెలిపారు. వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో విగ్రహాలకు హారతులు ఇచ్చి స్వాగతించి నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించారు. కార్పొరేషన్‌లోని లడ్డూ ప్రసాదాన్ని ఈ ఏడాది మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్టర్‌ జనార్ధన్‌ రెడ్డి వేలంలో ఎనిమిది లక్షలకు పాడుకుని దక్కించుకున్నారు.
తిరుపతి శెట్టిపల్లి గ్రామంలో యువత వినాయక ఉత్సవాల్లో భక్తిభావంతో మెలగాలని అలిపిరి సిఐ అబ్బన్న, ఎస్‌ఐ రాజశేఖర్‌ సూచించారు. శ్రీకాళహస్తి పట్టణ శివారులు వెంకయ్యస్వామి ఆలయ సమీపంలోని జర్నలిస్టు కాలనీలో బుధవారం అన్నదానం చేశారు. విష్ణు, చాముండేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్‌.రవి, వెంకటేశ్వర్లు, విష్ణు, సుబ్రమణ్యం, నాగరాజు, వలిపి శ్రీరాములు, దొరబాబు పాల్గొన్నారు. బిఎన్‌ కండ్రిగ బీసీ కాలనీలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు బొర్రా వేణు కుటుంబం, జిల్లా పరిషత్‌ఉన్నత పాఠశాల ఆంగ్లభాష ఉపాధ్యాయులు రాకేష్‌, లోకేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. చంద్రశేఖర్‌, వెన్నెల, ధనంజయులు, మణెమ్మ ఆధ్వర్యంలో 15వేల రూపాయలకు లడ్డూ ప్రసాదాన్ని వేలం పాటలో పాడుకున్నారు. వెంకటగిరిలో కౌన్సిలర్‌ ఆరి శంకరయ్య ఆధ్వర్యంలో ఉట్టి కొట్టారు. తిరుచానూరు సర్పంచి కె.రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. రేణిగుంట పట్టణంలోని జిఎం స్ట్రీట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదురుగా అభయ వినాయక అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమ వద్ద బుధవారం దరియా అనీల్‌కుమార్‌, సుమశ్రీలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. అతిథులను అసోసియేషన్‌ అధ్యక్షులు లక్ష్మణ్‌, ముఖ్య సలహాదారులు జూలియన్‌రాజు శాలువాతో సన్మానించారు. రేణిగుంట బుగ్గవీధిలో వినాయకుని విగ్రహాన్ని రష్‌ ఆస్పత్రి అధినేత, ఎంఎల్‌సి డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం దర్శించుకున్నారు. పాకాలలోని డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వినాయక చవితి పూజలో ఉపయోగించే పత్రిపై మినీ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించామని కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్‌ మెహిద్దీన్‌బాష ఓ ప్రకటనలో తెలిపారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ మోహన్‌ బెహరా పాల్గొన్నారు. గూడూరులో దిగువ వీరారెడ్డిపల్లి యూత్‌ ఆధ్వర్యంలోవ ఇనీష్‌ యాదవ్‌ సహకారంతో జరిగింది. లడ్డు వేలం పాటలో మామా అల్లుళ్లు దుగ్గన అఖిల్‌ కుమార్‌ యాదవ్‌, నాలి మధుసూదన్‌యాదవ్‌లు 45వేల ఒక్క రూపాయికి దక్కించుకున్నారు. వినాయకుని నిమజ్జనంలో జాగ్రత్తలు తీసుకోవాలని గూడూరు రూరల్‌ సిఐ డి.దశరథ రామారావు సూచించారు.