పనాజీ : గోవాలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 38 స్థానాల నుంచి బిజెపి పోటీ చేయనుంది. పార్టీ సీనియర్ నేత ఒకరు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బెనౌలియం, నువెం నియోజకవర్గాల్లో బిజెపి పోటీ చేయదని ఆ పార్టీ నేత చెప్పారు. ఈ రెండు స్థానాల్లో క్రైస్తవ ఓటర్లు అధికంగా ఉన్నారు. పార్టీ కోర్ కమిటీ సమావేశాల తరువాత అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు.










