ప్రజాశక్తి-సత్తెనపల్లి : సత్తెనపల్లి పట్టణానికి చెందిన వారు విహార యాత్ర కోసం గోవాకు వెళ్లి తిరిగివస్తుండగా తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు గాయపడగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల బంధువుల వివరాలు ప్రకారం.. సత్తెనపల్లిలోని వాసులు లక్ష్మీ టాకీస్ ప్రొప్రైటర్ షేక్ షుకూరు (50), షేక్ బాషా అలియాస్ బేకరీ సైదా (50), మరోకరితో కలిసి నాలుగు రోజుల కిందట గోవా పర్యటన నిమిత్తం కారులో వెళ్లారు. యాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా గురువారం తెల్లవారుజామున వీరి వాహనం తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా ముక్తల్ మండలం గుడిగండ్ల వద్ద 167వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలు అతివేగంగా ఢకొీట్టింది. షుకూరు, బాషాలు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు. వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. విషయం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం సత్తెనపల్లికి శుక్రవారం తీసుకొస్తారని తెలిపింది. మృతుడు షుకూరుకు భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భాషకు భార్య, కుమారుడు కుమార్తె ఉన్నారు.










