Dec 09,2022 23:46

గ్యారేజ్‌లో చెరకు వేసి క్రషింగ్‌ ప్రారంభిస్తున్న ఎమ్‌డి సన్యాసినాయుడు తదితరులు.

ప్రజాశక్తి- చోడవరం
గోవాడ చక్కెర కర్మాగారంలో శుక్రవారం లాంఛనంగా క్రషింగ్‌ ప్రారంభమైంది. ఫ్యాక్టరీ ఎమ్‌డి వి.సన్యాసినాయుడు క్రషింగ్‌ ముహూర్తంగా గ్యారేజ్‌లో చెరుకు కట్టలను వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెగ్యులర్‌ క్రసింగ్‌ మరో ఐదు రోజుల్లో ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ఏడాది 50వేల టన్నులు క్రషింగ్‌ జరపడానికి సన్నద్ధం చేశామన్నారు. ఫ్యాక్టరీ పరిధిలో ఉడుపు, కారిసె తోట కలిపి 20 వేల ఎకరాల్లో సాగుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అగ్రిమెంట్‌కు మించి రైతుల నుండి చెరకు సేకరణ జరుగుతుందని, రైతులందరూ ఇది గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో రమణమూర్తి, యూనియన్‌ నాయకులు కె.భాస్కరరావు ఫ్యాక్టరీ సిబ్బంది పాల్గొన్నారు.