May 30,2023 22:57

ప్రజాశక్తి-వన్‌టౌన్‌ : చిట్టినగర్‌ కె యల్‌ రావు నగర్‌లోని రాకేష్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు గోవా నత్యాలతో అలరించారు. మే 30న గోవా అవతరణ దినోత్సవం సందర్బంగా మంగళవారం రాజభవన్‌లో నిర్వహించిన ప్రోగ్రామ్‌లో రెండో సారి రాకేష్‌ పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌ ఏఎన్‌వి రావ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు పాల్గొని గోవా సాంప్రదాయ నత్యంను ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ సమక్షంలో చేశారు. గోవా నృత్యాలను స్వయంగా చూసిన గవర్నర్‌ విద్యార్థులను అభినందించారు. అనంతరం రాజభవన్‌ అధికార్లతో స్కూల్‌ విద్యార్థులు విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాకేష్‌ స్కూల్‌ టీచర్స్‌ రమేష్‌, సాధిక, అనిల్‌ పాల్గొన్నారు.