గోవా జాతీయ క్రీడలు ఆంధ్రప్రదేశ్ చెఫ్ డి మిషన్‌గా ఆర్‌కె పురుషోత్తం పతాకధారిగా ఆసియా క్రీడల పతక విజేత యర్రాజీ జ్యోతి

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఎపిఒఎ) అధ్యక్షుడు ఆర్‌కె పురుషోత్తం అక్టోబర్ 26 నుండి నవంబర్ 9 వరకు గోవాలో నిర్వహించబడే 37వ జాతీయ క్రీడల కోసం ఆంధ్రప్రదేశ్ చెఫ్ డి మిషన్‌గా నామినేట్ అయ్యారు. అలాగే, అంతర్జాతీయ అథ్లెట్, ఆసియా క్రీడల పతక విజేత యర్రాజీ జ్యోతి ఆంధ్ర ప్రదేశ్ జట్టుకు పతాకధారిగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఎపిఒఎ) ఈ రెండు సూచనలను భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ), గోవా జాతీయ క్రీడల నిర్వహణ కమిటీకి పంపింది. ఎపిఓఎ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎటువంటి వ్యతిరేకత లేకుండా ఈ రెండు నామినేషన్లను ఏకగ్రీవంగా ఆమోదించింది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో అంతకుముందు జరిగిన జాతీయ క్రీడలలో, అంతర్జాతీయ వాలీబాల్ కోచ్, రిఫరీ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎవి రమణరావు చెఫ్ డిమిషన్‌గా వ్యవహరించారు. అంతర్జాతీయ ఆర్చరీ వెన్నం జ్యోతి సురేఖ ఆంధ్ర ప్రదేశ్ కంటెంజెంట్‌కు జెండా బేరర్‌గా వ్యవహరించారు. కాగా, మరో ఇద్దరు డిప్యూటీ చెఫ్ డి మిషన్, మరో ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్‌ను నియమించాలని ఎపిఓఎకు ఐఓఎ సమాచారం పంపించింది. దీని గురించి ఈ నెల 12న విజయవాడలో జరిగే ఏపీఓఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ నామినేషన్లను ఖరారు చేయనున్నారు. ఎపిఓఎ అధ్యక్షుడు ఆర్‌కె పురుషోత్తం మాట్లాడుతూ, గోవా నేషనల్ గేమ్స్ యొక్క 37 వ ఎడిషన్ గురించి, ఈ నెల 12న విజయవాడలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్)తో సంయుక్త సమావేశం నిర్వహించాలని ఆలోచిస్తోందని,. దాని కోసం, అతని సంఘం ఇప్పటికే శాప్ వైస్ ఛైర్మన్‌డ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌ఎం ధ్యానచంద్రకు ఒక లేఖ రాసిందదన్నారు. గోవా జాతీయ క్రీడల కోసం చెఫ్ డి మిషన్‌ను నియమించడానికి సెప్టెంబరులో ఐఓఎ నుండి ఎపిఓఎకి ఎలాంటి ఇమెయిల్‌లు లేదా సమాచారం అందలేదని అతను చెప్పాడు. అప్పుడు ఎపిఓఎ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు తీర్పును అందించడానికి ముందుగానే ఐఓఎ చెఫ్ డి మిషన్, డిప్యూటీ చెఫ్ డి మిషన్, ఇతర సహాయక సిబ్బందికి సంబంధించి ఎపిఓఎకు ఇమెయిల్ పంపించినట్లు తెలిపారు. కాగా, గోవా జాతీయ క్రీడలకు వెళ్లేందుకు ఏపీఓఏ సన్నాహాలు చేస్తోందని తెలిపారు. ఎంపిక చేసిన ఆటల క్రీడా సంఘాలతో సమావేశం నిర్వహించేందుకు తమ సంఘం సిద్ధమైందని తెలిపారు. ప్రస్తుతానికి, బీచ్ వాలీబాల్ (పురుషులు మరియు మహిళలు), బీచ్ హ్యాండ్‌బాల్ (పురుషులు), ఫీల్డ్ హ్యాండ్‌బాల్ (పురుషులు), ఖో-ఖో (పురుషులు), సాఫ్ట్‌బాల్, సెపక్ తక్రా (పురుషులు), అథ్లెటిక్స్, రెజ్లింగ్, బాక్సింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్క్వాష్ , ట్రయాథ్లాన్, గోల్ఫ్, టెన్నిస్, నోయింగ్, కయాకింగ్, రోయింగ్, మోడరన్ పెంటాథ్లాన్, వుషు, యోగా, మల్లకంబా మరియు ఇతర ఆటలు జాతీయ క్రీడలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు.