ప్రజాశక్తి- సింహాచలం: సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు సంపంగి శ్రీనివాసరావు సమకూర్చిన సొంత నిధులు రూ.16 లక్షలతో గోసంరక్షణకు గోశాలలో నూతన షెడ్డు నిర్మాణానికి బుధవారం దేవస్థానం ఇఒ ఎంవి. సూర్యకళతో కలిసి శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఇఒ మాట్లాడుతూ గోవుల సంరక్షణకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. షెడ్ నిర్మాణదాత, ధర్మకర్తల మండలి సభ్యులు సంపంగి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయ సాధనకు తగినట్లుగా తాను పనిచేస్తానని త్వరలోనే ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూఅప్పన్న సోదరి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. సింహగిరిపై తిరునామాలు వెంటనే ఏర్పాటు చేయాలన్న శ్రీనుబాబు వినతికి ఇఒ స్పందించి త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఎఇఒలు నక్కాన ఆనంద్‌కుమార్, రమణమూర్తి, ఇఇ శ్రీనివాస్‌రాజు, డిఇ రాంబాబు ధర్మకర్తల మండల సభ్యులు దినేష్‌రాజు, సతీష్, యం రాజేశ్వరి, శ్రీదేవి వర్మ, డి రామలక్ష్మి, ప్రత్యేక ఆహ్వానితులు చందు యాదవ్ పాల్గొన్నారు










