సత్యం ప్రభాకర్ రావుతో ఎమ్మెల్యే ఎర్రకోట
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
గోనెగండ్ల మండలాన్ని నియోజకవర్గ విభజనలో భాగంగా పత్తికొండ నుంచి ఎమ్మినూరుకు బదలాయింపు జరిగిందని, పత్తికొండ కోట కోర్టు నుంచి ఎమ్మిగనూరు కోర్టుకు మార్చాలని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి కోరారు. గురువారం విజయవాడలో న్యాయ, శాసన వ్యవహారాలు అండ్ న్యాయ పాలన న్యాయ శాఖ, ప్రభుత్వ కార్యదర్శి గాదం సత్యం ప్రభాకర్ రావును కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గోనెగండ్ల మండల ప్రజలు కోర్టుకు వెళ్లాలంటే పత్తికొండకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఎమ్మిగనూరు కోర్టుకు మార్చాలని కోరారు.










