Nov 05,2023 20:58

ఫొటో : గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న జెవివి నాయకులు

గోడపత్రికలు ఆవిష్కరణ
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణ జన విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ''చెకుముకి సైన్స్‌ సంబరాలు 2023-24'' గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఆదివారం పట్టణంలోని రవి నర్సింగ్‌ హోమ్‌ కావలి పట్టణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అధ్యక్షులు తోట.వెంకటేశ్వర్లు అధ్యక్షతన విస్తత కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గౌరవ అధ్యక్షులు డాక్టర్‌. బెజవాడ.రవికుమార్‌, 'చెకుముకి సైన్స్‌ సంబరాలు-2023-24' గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బెజవాడ.రవికుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులలో సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించడానికి చెకుముకి సంబరాలు దోహదం చేస్తాయన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథాన్ని పెంపొందించడానికి జె.వి.వి. నిరంతరం కృషి చేస్తుందన్నారు.
విద్యార్థులు చదువుతోపాటు పర్యావరణం, సమాజంపై అవగాహన పెంచుకొని సైన్సును నిత్య జీవితానికి అనువదించుకోవడం నేర్చుకోవాలన్నారు. అధ్యక్షులు తోట.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చెకుముకి సైన్స్‌ సంబరాలు నాలుగుస్థాయిల్లో నిర్వహిస్తున్నారని తెలిపారు. నవంబర్‌ 10న పాఠశాల స్థాయి, 30 మండల/పట్టణస్థాయి, జిల్లాస్థాయి డిసెంబర్‌ 17, 2024 జనవరి 27, 28 తేదీల్లో రాష్ట్రస్థాయిలో జరుగుతాయని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ జె.వి.వి. ప్రధాన కార్యదర్శి గాదిరెడ్డి. హరినాథ్‌, టి.సుబ్బరామశర్మ, జె.వి.వి. జిల్లా నాయకులు పాపిశెట్టి.జానకిరామ్‌, జి.కళ్యాణి, ఉపాధ్యక్షులు శ్రీకర్ల.వెంకయ్య, షేక్‌.ఖాదర్‌ భాషా, కే.హరినారపరెడ్డి, సి.కల్లయ్య, కార్యదర్శులు సి.హెచ్‌.శారద, గాదిరెడ్డి.మురళీకృష్ణ, కే.జాన్‌, కార్యవర్గ సభ్యులు ఎం.వి.ఎన్‌. ప్రసాద్‌, అమిరిశెట్టి.హాజరతయ్య, షేక్‌.ఖాదర్‌బీ, షేక్‌.జమీర్‌, మండవ.వెంకటరమణయ్య, ఎస్‌.రమణయ్య పాల్గొన్నారు.