ప్రజాశక్తి-జగ్గయ్యపేట: పట్టణంలోని టీచర్స్ కో ఆపరేటివ్ సొసైటీ కార్యాలయ ఆవరణలో యుటిఎఫ్ జగ్గయ్యపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21న సాయంత్రం ఐదు గంటలకు ఎస్‌జిఎస్ కాలేజీలోని యూజీసీ బ్లాక్‌లో కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావుతో గ్రూప్-2 పరీక్షల నూతన సిలబస్‌పై అవగాహనా సదస్సుకు సంబంధించిన గోడపత్రికను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సహాధ్యక్షులు ఎం.కృష్ణయ్య మాట్లాడుతూ పోటీ పరీక్షల శిక్షణలో అపార అనుభవం ఉన్న ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఇచ్చే గైడెన్స్‌ను జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులు, గ్రూప్-2 పరీక్షల అభ్యర్థులు వినియోగించుకోగలరని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు హాజరయ్యే విద్యార్థులకు 120 పేజీల గ్రూప్-2 మెటీరియల్ ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జె.సుధానంద్, జగ్గయ్యపేట మండల శాఖ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు జి.పల్లవి, జి.ముక్తేశ్వరరావు, కోశాధికారి టి.ప్రసాద్ బాబు, జిల్లా కౌన్సిల్ సభ్యులు అల్లిక నరసింహారావు, వత్సవాయి మండల శాఖ ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.