Nov 13,2023 20:05

కందుకూరులో గోడ పత్రిక అవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి -కందుకూరు : అసమానతలు లేని అభివద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా రక్షణ బేరి యాత్ర ముగింపు సందర్భంగా నవంబర్‌ 15న విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభ, ర్యాలీని జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం సుందరయ్య భవన్‌లో వాల్‌ పోస్టర్‌ను సిపిఎం జిల్లా సీనియర్‌ నాయకులు ముప్పరాజు కోటయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముప్పరాజు కోటయ్య మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎపి ద్రోహం చేసిందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇస్తానని హామీనిచ్చి మోసం చేసిందన్నారు. రామాయపట్నంలో మేజర్‌ పోర్టు నిర్మిస్తానని మైనర్‌ పోర్టు నిర్మిస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం పక్కన పెట్టేశారన్నారు. ఇలా అన్ని విధాలుగా బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. సిపిఎం గుడ్లూరు ఉలవపాడు మండల కార్యదర్శులు జి వెంకటేశ్వర్లు, జి వి బి కుమార్‌, మండల నాయకులు దువ్వూరి జాన్‌, కుంచాల అనిల్‌ కుమార్‌, మిట్టనోసల సుభాను పాల్గొన్నారు.
గుడ్లూరు : అసమానతలు లేని అభివద్ధి కోసం సిపిఐఎం ప్రజా రక్షణ బేరి యాత్ర ముగింపు సందర్భంగా 15న విజయవాడలో భారీ బహిరంగ సభ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం నాడు గుడ్లూరులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్‌ జి వెంకటేశ్వర్లు మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిందన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న కూడా బిజెపిని ప్రశ్నించకపోవడం శోచనీయమన్నారు. సిపిఎం నాయకులు కొట్టే వెంకయ్య ఎం సుభాన్‌ జి రాజేష్‌ జి జాషువా మన్యం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.