May 10,2023 22:47

పిబిదేవం వద్ద గోదావరి కాల్వను పరిశీలిస్తున్న డిపిఒ, పిసిబి ఇఇ బృందం


ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌
సామర్లకోట గోదావరి కాల్వలో కాలుష్య జలాలు చేరి నీరు నల్లగా మారి కలుషి తమైందన్న ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని హుస్సేన్‌పురం, వేట్లపాలెం, జి.మేడపాడు, పెదబ్రహ్మదేవం గ్రామాల వెంబడి పర్యటించి గోదావరి కాల్వలో జలాల పరిశీలనకు జిల్లా పంచాయితీ అధికారి ఆర్‌ విక్టర్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇఇ ఎన్‌ ఆశోక్‌ కుమార్‌లు పర్యటించారు. ఈ సందర్భంగా హుస్సేన్‌పురం, వేట్లపాలెం, మేడపాడు, పిబిదేవం వద్ద నీటి శాంపిల్స్‌ను సేకరించారు. ఆయా గ్రామాల పరిధిలో డ్రెయిన్‌ల అవుట్‌లెట్లు గోదావరి కాల్వలో ఎక్కడెక్కడ కలుస్తున్నాయో కూడా గుర్తించారు. పూర్తి స్దాయి నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందించనున్నట్లు ఈ సంద ర్భంగా డిపిఒ విక్టర్‌ చెప్పారు. వీరి వెంట సామర్లకోట ఇన్‌చార్జి ఇఒపిఆర్‌డి వై.శ్రీహరి, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.